భారతదేశం, ఏప్రిల్ 7 -- ఈ ఏప్రిల్ రెండో వారంలో ఓటీటీల్లో కొత్త సినిమాల సందడి బాగానే ఉండనుంది. కొన్ని సూపర్ హిట్ చిత్రాలు వివిధ ప్లాట్‍ఫామ్‍ల్లోకి రానున్నాయి. డిఫరెంట్ జానర్లలో సినిమాలు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనున్నాయి. బ్లాక్‍బస్టర్లు కోర్ట్, ఛావా ఈ వారంలోనే ఓటీటీలోకి రానున్నాయి. ఓ మలయాళ థ్రిల్లర్ సినిమా కూడా అడుగుపెట్టనుంది. ఓ హిందీ హారర్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ వారం (ఏప్రిల్ 7-13) ఓటీటీల్లోకి రానున్న 7 ముఖ్యమైన చిత్రాలు ఇవే..

తెలుగు లీగల్ డ్రామా సినిమా 'కోర్ట్' ఈవారంలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ శుక్రవారం ఏప్రిల్ 11వ తేదీన ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ప్రియదర్శి, హర్ష్ రోహణ్, శ్రీదేవి లీడ్ రోల్స్ చేసిన ఈ మూవీ మార్చి 14న థియేటర్లలో రిలీజైంది. రూ.10కోట్లతో రూపొందిన ఈ చిత్రం రూ.57కోట్ల కలెక్ష...