భారతదేశం, ఏప్రిల్ 22 -- మలయాళ యాక్షన్ థ్రిల్లర్ 'ఎల్2: ఎంపురాన్' భారీ బ్లాక్‍బస్టర్ సాధించింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్ల చిత్రంగా రికార్డు సృష్టించింది. పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‍లాల్ హీరోగా నటించిన ఆ చిత్రం ఆ రేంజ్‍లో దుమ్మురేపింది. చియాన్ విక్రమ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'వీర ధీర శూరన్: పార్ట్ 2' మూవీకి చాలా పాజిటివ్ టాక్ వచ్చింది. కాగా, ఈ రెండు చిత్రాలు ఒకే రోజు వేర్వేరు ఓటీటీలోకి రానున్నాయి. స్ట్రీమింగ్‍లో పోటీ పడేందుకు రెడీ అయ్యాయి. ఈ వారమే ఈ రెండు చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి.

భారీ అంచనాలతో వచ్చిన మలయాళ మూవీ 'ఎల్2: ఎంపురాన్' అదే రేంజ్‍‍లో హిట్ అయింది. మోహన్‍లాల్ హీరోగా నటించిన ఈ మూవీ మార్చి 27వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి పృథ్విరాజ్ సుకుమార్ దర్శకత్వం వహించటంతో కీలకపాత్ర ప...