భారతదేశం, మార్చి 8 -- వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి ఈ వారం కొన్ని సినిమాలు అడుగుపెట్టాయి. వివిధ జానర్లలో తెరకెక్కిన చిత్రాలు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చాయి. ఇందులో తొమ్మిది సినిమాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న మనమే మూవీ ఈవారంలోనే ఓటీటీలోకి వచ్చింది. రేఖాచిత్రం అడుగుపెట్టింది. తండేల్ మూవీ కూడా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. ఈవారం ఓటీటీల్లోకి వచ్చిన టాప్-8 చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.

బాపు చిత్రం ఈ శుక్రవారం (మార్చి 7) జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. బ్రహ్మాజీ, ఆమని, సుధాకర్ రెడ్డి, ధన్య బాలకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ థియేటర్లలో రిలీజైన మూడు వారాల్లోగానే హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. ఫాదర్ సెంటిమెంట్‍తో సాగే ఈ రూరల్ ఫ్యామిలీ డ్రామా మూవీకి దయాకర్ రెడ్డి దర్శకత్వం వహించారు....