భారతదేశం, మార్చి 15 -- ఓటీటీల్లో కొత్త చిత్రాలు చూడాలనుకుంటున్న వారికి ఈ వారం జాతరే. ఏకంగా 10 సినిమాలు ఈ వారం స్ట్రీమింగ్‍కు వచ్చేశాయి. వివిధ ప్లాట్‍ఫామ్‍ల్లో.. విభిన్నమైన జానర్లలో చిత్రాలు ఎంట్రీ ఇచ్చాయి. క్రైమ్ థ్రిల్లర్ నుంచి కామెడీ, ఎమోషనల్ సహా మరిన్ని జానర్లలో మూవీ అడుగుపెట్టాయి. ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన టాప్-10 చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.

బాసిల్ జోసెఫ్ హీరోగా నటించిన పొన్మన్ మూవీ జియోహాట్‍స్టార్ ఓటీటీలో ఈ వారమే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ డార్క్ కామెడీ మూవీ మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. జోతిష్ సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో సూపర్ హిట్ అయింది.

తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఏజెంట్ ఈ వారమే సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. సుమారు థియేటర్లలో రిలీజైన 2...