భారతదేశం, జనవరి 29 -- సీనియర్ యాక్టర్ బొమన్ ఇరానీ బాలీవుడ్‍లో చాలా చిత్రాల్లో నటించారు. అయితే, తెలుగులో అత్తారింటికి దారేది మూవీతో బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత మరికొన్ని తెలుగు సినిమాల్లో నటించారు. బాలీవుడ్‍లో వరుసగా చిత్రాలు చేస్తున్నారు. బొమన్ ఇరానీ ఇప్పుడు దర్శకుడిగా మారారు. 'ది మెహతా బాయ్స్' చిత్రానికి డైరెక్షన్ చేశారు. దర్శకత్వంతో పాటు ఈ మూవీలో లీడ్ రోల్ కూడా చేశారు. ఈ సినిమా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. నేడు (జనవరి 29) ట్రైలర్‌తో పాటు స్ట్రీమింగ్ డేట్ కూడా వెల్లడైంది.

ది మెహతా బాయ్స్ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డబ్బింగ్ వెర్షన్‍ల్లోనూ అందుబాటులోకి వస్తుంది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవనుంది. ఈ విషయాన్ని నేడు ట్రైలర్‌తో పాటే ప్రైమ్...