Hyderabad, ఫిబ్రవరి 18 -- OTT Movie: ఓటీటీలో యానిమేటెడ్ మూవీస్ ఇష్టపడేవారి కోసం మరో సినిమా వచ్చేసింది. రూ.670 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.2800 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా పేరు ది వైల్డ్ రోబో(The Wild Robot). గతేడాది థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన ఈ మూవీ.. కొన్నాళ్లుగా అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో రెంట్ విధానంలో అందుబాటులో ఉంది.

ది వైల్డ్ రోబో మూవీ ఇప్పుడు జియోహాట్‌స్టార్ లోకి స్ట్రీమింగ్ కు రావడం విశేషం. ఇప్పటికే ఈ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వాళ్లు ఫ్రీగా ఈ సినిమాను చూడొచ్చు. 2016లో పీటర్ బ్రౌన్ రాసిన ది వైల్డ్ రోబో నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. క్రిస్ సాండర్స్ డైరెక్ట్ చేయగా.. లుపితా న్యోంగో, పెడ్రో పాస్కల్, కిట్ కానర్, బిల్ నిగీ, స్టెఫానీ సులాంటి వాళ్లు నటించార...