Hyderabad, ఏప్రిల్ 1 -- OTT movie: ఓటీటీలోకి చిన్న సినిమాలను ఎక్కువగా తీసుకొచ్చే ఈటీవీ విన్ మరో తెలుగు మూవీని అందిస్తోంది. తెలుగు ప్రేక్షకులందరూ ఉచితంగా ఈ సినిమాను చూసే అవకాశం కూడా కల్పిస్తోంది. ఒకే రోజు ఇలా రెండు సినిమాలను ఫ్రీగా తీసుకురానుండటం విశేషం. ఆ మూవీస్ ఏంటో చూడండి.

ఈటీవీ విన్ ఓటీటీ ఈ వీకెండ్ మరో తెలుగు సినిమాను తీసుకొస్తోంది. ఈ మూవీ పేరు ఉత్తరం. కథాసుధ అందిస్తున్న సినిమా ఇది. దీనిని ఫ్రీగా ఎవరైనా చూడొచ్చని ఆ ఓటీటీ తెలిపింది. వచ్చే ఆదివారం (ఏప్రిల్ 6) నుంచి ఈ మూవీని ఈటీవీ విన్ లో చూడొచ్చు.

"పదాల్లోనే ప్రేమ, ఉత్తరాల్లో భావోద్వేగాలు ఉన్నప్పటి రోజులు.. ఈ స్మార్ట్‌ఫోన్లు, ఇన్‌స్టాంట్ మెసేజింగ్ కంటే ముందు ప్రేమను ఇంక్, పేపర్ తోనే తెలియజేసేవారు. కథాసుధ నుంచి ఉత్తరం. ఏప్రిల్ 6 నుంచి స్ట్రీమింగ్. ఈటీవీ విన్ లో ఫ్రీగా చూడండి" అనే క్యాప్...