భారతదేశం, మార్చి 17 -- మలయాళ థ్రిల్లర్ చిత్రాలకు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. కొత్త థ్రిల్లర్ సినిమాలు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురుచూస్తుంటారు. అలాంటి వారు ఓటీటీల్లో మూడు రీసెంట్ మలయాళ చిత్రాలను అసలు మిస్ కాకూడదు. రెండు ఇప్పటికే స్ట్రీమింగ్‍కు రాగా.. మరొకటి ఈ వారం అడుగుపెట్టనుంది. థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారు ఈ మూడు సినిమాలను తప్పనిసరిగా చూడాలి. ఏవంటే..

రేఖాచిత్రం సినిమా గ్రిప్పింగ్‍గా మంచి థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. 40 ఏళ్ల క్రితం జరిగిన ఓ అమ్మాయి మర్డర్ గురించి ఓ పోలీస్ చేసే దర్యాప్తు చుట్టూ ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ సాగుతుంది. చిత్రమంతా ఎంగేజింగ్‍గా సాగుతోంది. ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించిన రేఖాచిత్రం మూవీకి జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించారు. జనవరిలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బ్లాక్...