భారతదేశం, జనవరి 29 -- ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో మలయాళ చిత్రాలకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఇతర భాషల ప్రేక్షకులు కూడా నయా మాలీవుడ్ సినిమాల కోసం కోసం చూస్తుంటారు. త్వరలో ఓటీటీల్లో నాలుగు పాపులర్ మలయాళ చిత్రాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి. ఈ నాలుగూ థ్రిల్లర్లే. ఇందులో రెండు భారీ హిట్‍లు కాగా.. రెండు ప్లాఫ్‍లు ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

ఐడెంటిటీ మూవీ జనవరి 31వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది. ఈ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో టొవినో థామస్, త్రిష లీడ్ రోల్స్ చేశారు. ఓ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది.

ఐడెంటిటీ మూవీకి అఖిల్ పౌల్, అనాస్ ఖాన్ దర్శకత్వం వహించారు. జనవరి 2న ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. గత వారం తెలుగులోనూ వచ్చ...