Hyderabad, మార్చి 10 -- OTT Malayalam Thriller Movies: మలయాళం థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దాదాపు అన్ని హిట్ సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నారు. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో అవి అందుబాటులో ఉన్నాయి. అయితే ఆహా వీడియో ఓటీటీలోనూ ఐదు మలయాళ థ్రిల్లర్ మూవీస్ తెలుగులో ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి.

మలయాళంలో 2021లో వచ్చిన నాయట్టు మూవీని తెలుగులో చుండూరు పోలీస్ స్టేషన్ పేరుతో డబ్ చేశారు. ఈ సినిమా ఆహా వీడియో ఓటీటీలో అందుబాటులో ఉంది. ముగ్గురు పోలీస్ అధికారులు, వాళ్లను ఓ తప్పుడు కేసులో ఇరికించే అవినీతి అధికారులు, అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి వాళ్లు పరారవడం.. ఇలా సాగుతుందీ మూవీ. పోలీస్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్లు ఈ చుండూరు పోలీస్ స్టేషన్ ను మిస్ కాకుండా చూడండి.

మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ...