Hyderabad, మార్చి 6 -- OTT Malayalam Thriller Movie: సోనీ లివ్ ఓటీటీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమా, మిస్టరీ థ్రిల్లర్ రేఖాచిత్రమ్ ఒక రోజు ముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఐదు భాషల్లో ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.

ఈ ఏడాది జనవరి 10న థియేటర్లలో రిలీజై సంచలన విజయం సాధించిన మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ రేఖాచిత్రమ్. ఈ సినిమాను నిజానికి శుక్రవారం (మార్చి 7) నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు చాలా రోజులుగా సోనీ లివ్ ఓటీటీ చెబుతూ వస్తోంది. అయితే ఒక రోజు ముందే అంటే గురువారం (మార్చి 6) సాయంత్రం నుంచే స్ట్రీమింగ్ కు తీసుకురావడం విశేషం.

మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమా ఇది. రూ.9 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి.. ఏకంగా...