Hyderabad, ఏప్రిల్ 8 -- OTT Malayalam Romantic Comedy: మలయాళం సినిమాలను ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ మలయాళం సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. అయితే అందులో ఒక రొమాంటిక్ కామెడీ మాత్రం మూడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి అడుగుపెడుతోంది. ఈ సినిమా పేరు పెయిన్‌కిలీ (Painkili).

మలయాళం మూవీ పెయిన్‌కిలీ సుమారు రెండు నెలల కిందట వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడీ సినిమా వచ్చే శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

మొదట కేవలం మనోరమ మ్యాక్స్ లో మాత్రమే వస్తుందని చెప్పినా.. ఈ ఓటీటీలో వచ్చే ప్రతి మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెడుతోంది. ఆ లెక్కన పెయిన్‌కిలీ కూడా అదే రోజు మనోరమ మ్యాక్స్ తోపాటు ప్రైమ్ వీడియోలోకి వస్తుందని ఓటీటీప్లే రిపోర్టు వెల్లడించింది.

దీంతోపాట...