Hyderabad, ఏప్రిల్ 17 -- OTT Malayalam Mystery Thriller: మలయాళం థ్రిల్లర్ మూవీస్ లవర్స్ కు ఓ గుడ్ న్యూస్. మూడు నెలల తర్వాత ఓ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఓటీటీలోకి వస్తుంది. ఈ మూవీ పేరు అం అ: (Am Ah). ఓ డిఫరెంట్ టైటిల్ తో వచ్చిన ఈ సినిమాలో సీనియర్ నటుడు దిలీష్ పోతన్ లీడ్ రోల్లో నటించాడు. జనవరిలో థియేటర్లలో రిలీజైన మూవీ.. మొత్తానికి ఓటీటీలోకి వస్తోంది.

మలయాళం మూవీ అం అ: జనవరి 24న థియేటర్లలో రిలీజైంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ సంపాదించిన ఈ సినిమా మూడు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 18 నుంచి సన్ నెక్ట్స్ (Sun NXT) ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది.

మలయాళ సీనియర్ నటుడు దిలీష్ పోతన్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. ఇందులో జాఫర్ ఇడుక్కి, దేవదర్శిని కూడా కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ ఓటీటీలో మలయాళం ఆడియోలోనే అందుబాటులోకి రానుంది. అయితే ...