Hyderabad, మార్చి 7 -- OTT Malayalam Dark Comedy: ఓటీటీలోకి మరో సూపర్ హిట్ మలయాళం మూవీ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సినిమా పేరు పోన్‌మ్యాన్ (Ponman). ఈ ఏడాది ఆ ఇండస్ట్రీలో రిలీజైన హిట్ సినిమాల్లో ఇదీ ఒకటి. థియేటర్లలో రిలీజైన నెలన్నర రోజుల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

ఓటీటీలో మలయాళం సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అక్కడి స్టార్ హీరోల్లో ఒకడైన బేసిల్ జోసెఫ్ కు ఇక్కడా ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడతడు నటించిన పోన్‌మ్యాన్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమా జియోహాట్‌స్టార్ ఓటీటీలో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

"ఈ బంగారు మనిషి మెరుస్తాడు. పోన్‌మ్యాన్ మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది" అనే క్యాప్షన్ తో జియోహాట్‌స్టార్ మలయాళం తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది.

పోన్‌...