Hyderabad, ఏప్రిల్ 1 -- OTT Malayalam Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ మలయాళం మూవీ ఒకటి మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. తెలుగు సహా ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. వీటికి సంబంధించిన వేర్వేరు ట్రైలర్లను మంగళవారం (ఏప్రిల్ 1) సోనీ లివ్ ఓటీటీ రిలీజ్ చేసింది. జనవరిలో రిలీజై హిట్ కొట్టిన డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది.

మలయాళం స్టార్ హీరో బేసిల్ జోసెఫ్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రావింకూడు షాప్పు (Pravinkoody Shappu). ఈ సినిమా జనవరి 16న థియేటర్లలో రిలీజై మంచి విజయం సాధించింది. ఇప్పుడీ మూవీ ఏప్రిల్ 11 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

ఓ కల్లు షాపులో జరిగే హత్య, దాని చుట్టూ సరదాగా సాగే ఇన్వెస్టిగేషన్, ట్విస్టులతో ఈ మూవీ అక్కడి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలోకి రానుండటంతో మనవాళ్లను కూడా థ్రిల...