Hyderabad, మార్చి 14 -- OTT Malayalam Crime Thriller: డార్క్ కామెడీకి క్రైమ్ థ్రిల్లర్ జోడించి తీసిన మలయాళం మూవీ ప్రవీణ్‌కూడు షాప్పు (Pravinkoodu Shappu). రెండు నెలల కిందట థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ పై తాజాగా అప్డేట్ వచ్చింది. ఓ కల్లు షాపు ఓనర్ హత్య, 11 మంది అనుమాతులు, ఓ పోలీస్ ఆఫీసర్ జరిపే ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

మలయాళం సినిమా నుంచి ఈ ఏడాది జనవరిలో వచ్చిన మరో డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రవీణ్‌కూడు షాప్పు. జనవరి 16న థియేటర్లలో రిలీజైంది. శ్రీరాజ్ శ్రీనివాసన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను ఏప్రిల్ 11 నుంచి సోనీ లివ్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. మూవీ ట్రైలర్ రిలీజ్ చేస్తూ.. స్ట్రీమింగ్ విషయాన్ని ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

"అర్ధరాత్రి తర్వాత మంచి అనేది ఏదీ జరగదు. ఎంతో గందరగోళాని...