Hyderabad, మార్చి 25 -- OTT Malayalam Comedy Movies: మలయాళం స్టార్ హీరోల్లో ఒకడు బేసిల్ జోసెఫ్. ఎక్కువగా కామెడీ సినిమాలే తీసే ఈ యువ నటుడు ఈ మధ్యే పొన్‌మ్యాన్ (Ponman) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జియోహాట్‌స్టార్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా నవ్విస్తూనే భావోద్వేగానికి గురి చేస్తోంది. మరి ఈ బేసిల్ నటించిన బెస్ట్ మలయాళం కామెడీ సినిమాలు ఓటీటీలో ఇంకా ఏవి ఉన్నాయో చూడండి.

మలయాళం హీరో బేసిల్ జోసెఫ్ నటించిన సినిమాలు ఎక్కువగా ప్రైమ్ వీడియో, జీ5, జియోహాట్‌స్టార్, సోనీ లివ్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.

ఇదో భిన్నమైన స్టోరీ. ఇందులో రాజేష్ అనే ఓ పౌల్ట్రీ వ్యాపారం చేసే వ్యక్తిగా బేసిల్ జోసెఫ్ నటించాడు. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను తన తీరుతో చిత్రహి...