Hyderabad, మార్చి 20 -- OTT Malayalam Action Thrillers: మలయాళ సినిమా నిజంగా యాక్షన్ థ్రిల్లర్స్ విషయంలో తన సత్తా చూపించింది. ముఖ్యంగా ఉన్ని ముకుందన్ నటించిన బ్రూటల్ మూవీ మార్కో బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసింది. ఆ తర్వాత జోజు జార్జ్ డైరెక్ట్ చేసిన పని, మమ్ముట్టి నటించిన టర్బో కూడా యాక్షన్‌లో జోరు చూపించాయి. అలా ఉన్ని ముకుందన్ "మార్కో" నుంచి టోవినో థామస్ "ఐడెంటిటీ" వరకు ఓటీటీలో చూడాల్సిన టాప్ 6 మలయాళం యాక్షన్ థ్రిల్లర్స్ ఏవో ఇక్కడ చూడండి.

ఉన్ని ముకుందన్ తన కెరీర్‌లోనే అత్యంత బ్రూటల్ అవతార్‌ని స్క్రీన్‌పై చూపించాడు. మలయాళంలో ఇప్పటివరకూ వచ్చిన అత్యంత వైలెంట్ యాక్షన్ మూవీగా దీన్ని చెప్పొచ్చు. హనీఫ్ అదేని డైరెక్షన్‌లో ఈ మూవీ వచ్చింది. అంధుడైన తన అన్న విక్టర్ చనిపోయిన తర్వాత మార్కో చేసే హత్యల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. సిద్ధిక్, జగదీష్, కబీర్ దుహాన్...