Hyderabad, ఏప్రిల్ 17 -- OTT Malayalam Action Thriller: మలయాళం ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ, అత్యంత వివాదాస్పదంగా మారిన ఎల్2: ఎంపురాన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. గురువారం (ఏప్రిల్ 17) జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ తేదీని అనౌన్స్ చేసింది. మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో అతనితోపాటు లీడ్ రోల్లో మోహన్ లాల్ నటించిన మూవీ ఎల్2: ఎంపురాన్. బాక్సాఫీస్ దగ్గర రూ.250 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ మూవీ.. వచ్చే గురువారం (ఏప్రిల్ 24) నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. నెల రోజుల్లోపే మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టనుండటం విశేషం.

ఈ విషయాన్ని ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "అబ్రహం ప్రపంచం ఇక్కడ ప్రా...