Hyderabad, ఏప్రిల్ 7 -- OTT Malayalam Action Movie: మలయాళం ఇండస్ట్రీ నుంచి యాక్షన్ సినిమాలు వచ్చేది తక్కువే. గతేడాది చివర్లో మార్కో రూపంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ రాగా.. ఈ ఏడాది మరో యాక్షన్ మూవీ దావీద్ (Daveed) వచ్చింది. ఓ విఫల బాక్సర్ చుట్టూ తిరిగే కథతో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ఆడిన తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది.

మలయాళం మూవీ దావీద్ ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఏప్రిల్ 18 నుంచి ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ మధ్య కాలంలో మెల్లగా మలయాళం సినిమాల హక్కులను దక్కించుకోవడంలో వేగం పెంచుతున్న జీ5.. ఈ దావీద్ హక్కులను కూడా సొంతం చేసుకుంది.

గోవింద్ విష్ణు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్ తోపాటు లిజోమోల్ జోస్, సైజు కురుప్ లాంటి వాళ్లు నటించారు. జీ5 ఓటీటీలో ఈ మూవీని ఫ్రీగానే చూసే వీలుంది. మూవీ స్ట్ర...