భారతదేశం, ఫిబ్రవరి 11 -- ఓటీటీలో మలయాళ చిత్రాలకు ఎక్కువ క్రేజ్ ఉంటుంది. కొన్ని తక్కువ బడ్జెట్ సినిమాలు కూడా ఓటీటీల్లో సత్తాచాటుతుంటాయి. ఇతర భాషల డబ్బింగ్ వెర్షన్‍లలోనూ వచ్చి మంచి వ్యూస్ దక్కించుకుంటుంటాయి. ఇదే ఇప్పుడు రిపీట్ చేసింది రైఫిల్ క్లబ్. ఈ మలయాళ యాక్షన్ చిత్రం ఓటీటీలో మూడు వారాలుగా టాప్-10లో ట్రెండ్ అవుతోంది. భారీ చిత్రాలు వచ్చినా.. ఇది మాత్రం ట్రెండింగ్‍లో నిలుస్తోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

రైఫిల్ క్లబ్ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం మూడు వారాలుగా నెట్‍ఫ్లిక్స్ ఇండియా సినిమాల టాప్-10లో ట్రెండింగ్‍లో ఉంటోంది. ఓ దశలో టాప్-2లోనూ నిలిచింది. ప్రస్తుతం (ఫిబ్రవరి 11) ఆరో స్థానంలో ట్రెండ్ అవుతోంది. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ.. భారీ చిత్రాల మధ్య మూడు వారాల నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో సత్తాచాటుతుండడం...