భారతదేశం, ఏప్రిల్ 13 -- మలయాళ సీనియర్ యాక్టర్ హరీశ్ పేరడి ప్రధాన పాత్రలో దాసెట్టంటే సైకిల్ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 14వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ కామెడీ డ్రామా చిత్రానికి అఖిల్ కవుంగల్ దర్శకత్వం వహించారు. ఈ లోబడ్జెట్ చిత్రం మోస్తరుగా థియేట్రికల్ రన్ సాధించింది. ఇప్పుడు ఈ దాసెట్టంటే సైకిల్ చిత్రం ఓటీటీలోకి వచ్చింది.

దాసెట్టంటే సైకిల్ చిత్రం నేడు (ఏప్రిల్ 13) మనోరమ మ్యాక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. మలయాళంలో మాత్రమే స్ట్రీమ్ అవుతోంది.

దాసెట్టంటే సైకిల్ మూవీని కామెడీతో పాటు సామాజిక అంశాలతో ముడిపెట్టి తెరకెక్కించారు డైరెక్టర్ అఖిల్. వాచ్‍మెన్‍గా పని చేసే ఓ మిడిల్‍క్లాస్ వ్యక్తి ఎదుర్కొనే పరిస్థితుల చుట్టూ ఈ మూవీ సాగుతుంది.

దాసెట్టంటే సైకిల్ చిత్రంలో హరీశ్ పేరడితో పాటు అంజన అప్పుకుట్టన్, వైది...