భారతదేశం, ఫిబ్రవరి 18 -- ఓటీటీల డిమాండ్ పెరిగిపోయాక తెలుగు ఆడియన్స్ కూడా తమిళ్, మలయాళం, కన్నడ లాంటి ఇతర భాషల సినిమాలను తెగ చూసేస్తున్నారు. మంచి కంటెంట్ ఉన్న మూవీస్ ను అసలు మిస్ కావడం లేదు. ఇప్పుడు అలాంటి ఓ మలయాళం మూవీ తెలుగులో థియేటర్లలో రిలీజైన ఆరు రోజులకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. చథా పచ్చ సినిమా మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్ కానుంది.

రీసెంట్ గా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమా చథా పచ్చ. ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రాబోతుంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తమిళ్, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఇది ఓటీటీ రిలీజ్ కానుంది.

సాధారణంగా సినిమాలు నాలుగు వారాల థియేట్రికల్ విండో తర్వాత ఓటీటీలోకి వస్తాయి. కొన్ని ఏమో రెండు వారాలకు వస్తాయి. కానీ ఈ మలయాళ మూవీ చథా పచ్చ ...