Hyderabad, ఫిబ్రవరి 11 -- OTT Kannada Action Thriller: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన మూవీ భైరతి రణగల్. ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలోకి రానుంది. గతేడాది నవంబర్ 15న రిలీజై సంచలన విజయం సాధించిన ఈ మూవీ.. డిసెంబర్ 25 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం కన్నడలోనే అందుబాటులో ఉండగా.. ఇప్పుడు తెలుగులోనూ రానుంది.

కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన భైరతి రణగల్ మూవీ ఆహా వీడియో ఓటీటీలోకి రాబోతోంది. గురువారం (ఫిబ్రవరి 13) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ఆ ఓటీటీ వెల్లడించింది. "ఓ గ్యాంగ్‌స్టర్ ఎప్పుడూ జన్మించడు. అతన్ని తయారు చేస్తారు.. భైరతి రణగల్ ఎలా తయారయ్యాడో చూడండి. ఫిబ్రవరి 13 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది" అనే క్యాప్షన్ తో ఆహా వీడియో ట్వీట్ చేసింది.

ఇప్పటికే ప్రైమ్ వీడియోలో కన్నడ ఆడియోలో అం...