Hyderabad, మార్చి 19 -- OTT Joju George Movies: మలయాళం సినిమాలంటేనే విలక్షణ కథలతో ఆకట్టుకుంటాయని పేరుంది. అందులోనూ జోజు జార్జ్ లాంటి నటులు ఎప్పుడూ అలరిస్తూనే ఉంటారు. ఈ మధ్యే అతడు నటించి, డైరెక్ట్ చేసిన పని మూవీ సోనీ లివ్ ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. నటుడిగానే కాకుండా సింగర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అయిన జోజు జార్జ్ నటించిన సినిమాల్లో ప్రస్తుతం ఓటీటీలో ఉన్న బెస్ట్ మూవీస్ ఏవో ఒకసారి చూద్దాం.

జోసెఫ్ (2018) ఒక మలయాళ క్రైమ్ థ్రిల్లర్. ఇందులో జోజు జార్జ్ ఓ రిటైర్డ్ పోలీసు అధికారి పాత్ర పోషించాడు. అతను తన మాజీ భార్య మరణానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తాడు. నలుగురు రిటైర్డ్ పోలీసుల జీవితాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ మూవీ కుటుంబ సంబంధాల సంక్లిష్టతలను, గతం చూపించే భావోద్వేగపరమైన ప్రభావాన్ని చూపిస్తుంది. జోజు జార్జ్ కు మంచి పే...