Hyderabad, ఏప్రిల్ 3 -- OTT Horror Thriller: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి మరో హారర్ థ్రిల్లర్ మూవీ సీక్వెల్ రాబోతోంది. నాలుగేళ్ల కిందట ఇదే ఓటీటీలో రిలీజై సంచలన విజయం సాధించిన మూవీకి సీక్వెల్ ఇది. ఆడపిల్లలను చంపే దెయ్యం కథ. ఈసారి ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందంటూ గురువారం (ఏప్రిల్ 3) రిలీజైన ట్రైలర్ భయపెడుతోంది. వచ్చే వారమే ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ప్రైమ్ వీడియోలోకి రాబోతున్న ఈ హారర్ థ్రిల్లర్ సీక్వెల్ పేరు చోరీ 2 (Chhorii 2). 2021లో వచ్చిన చోరీ మూవీకి సీక్వెల్. విశాల్ ఫూరియా డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. వారం రోజుల కిందట టీజర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా గురువారం (ఏప్రిల్ 3) ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో బాలీవుడ్ నటి నుష్రత్ బరూచా లీడ్ రోల్లో నటించింది.

ఆడపిల్లల...