భారతదేశం, జనవరి 28 -- హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం స్ట్రేంజ్ డార్లింగ్ గతేడాది 2024 ఆగస్టు 23వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ హాలీవుడ్ మూవీకి మంచి రివ్యూలు, రెస్పాన్స్ వచ్చాయి. ఈ చిత్రంలో విల్లా ఫిజ్‍గెరాల్డ్, కైల్ గాల్నెర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి జేటీ మొల్నెర్ దర్శకత్వం వహించారు. స్ట్రేంజ్ డార్లింగ్ చిత్రం ఇప్పుడు ఇండియాలో మరో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్‍కు వచ్చేసింది.

స్ట్రేంజ్ డార్లింగ్ చిత్రం జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో తాజాగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ హాలీవుడ్ మూవీ ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. జియోసినిమా ప్రీమియమ్ సబ్‍స్క్రైబర్లు ఈ మూవీని చూసేయవచ్చు. స్ట్రేంజ్ డార్లింగ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోనూ అందుబాటులో ఉంది.

స్ట్రేంజ్ డార్లింగ్ సినిమాను ఎరోటిక్ ...