భారతదేశం, మార్చి 18 -- హాలీవుడ్‍లో హారర్ చిత్రాలో బోలెడు వచ్చాయి. డిఫరెంట్ స్టోరీలతో భయపట్టేలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హారర్ జానర్ హాలీవుడ్‍లో బాగా వర్కౌట్ అవుతూనే ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగానూ కొన్ని హారర్ చిత్రాలు క్రేజ్ ఉంటుంది. గతేడాది వచ్చిన హారర్ కామెడీ థ్రిల్లర్ 'అబిగైల్' కూడా ట్విస్టులతో భయపెడుతూ మెప్పించింది. ఈ మూవీ ఓటీటీలో ఏడు భాషల్లో అందుబాటులో ఉంది.

'అబిగైల్' మూవీ జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍ అవుతోంది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్‍కు అందుబాటులో ఉంది. ఇలా ఏడు భాషల్లో హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

అబిగైల్ చిత్రంలో మెలీసా బెరేరా, డాన్ స్టీవెన్స్, ఆలిషా వెయిర్ ప్రధాన పాత్రలు పోషించారు. విల్ క్యాట్లెట్, క్యాథరిన్ న్యూటన్, అంగస్ క్లౌజ్, ఎస్పోస...