భారతదేశం, జనవరి 26 -- తెలుగులో గతేడాది చివర్లో వచ్చిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్ మూవీ శంబాల (Shambhala). ఆది సాయికుమార్ లీడ్ రోల్లో నటించిన సినిమా ఇది. ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అసలు అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే జోరు కొనసాగిస్తోంది.

ఆది సాయికుమార్ లీడ్ రోల్లో నటించిన శంబాల మూవీ ఆహా వీడియోలో 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును సొంతం చేసుకుంది. ఓటీటీలోకి అడుగు పెట్టిన ఐదు రోజుల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే వెల్లడించింది. "50 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినట్స్. ఒక భయపెట్టే స్టోరీ. ఆది శంబాల కేవలం ఆహాలో చూడండి" అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. గత వారం ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అయిన విషయం తెలిసిందే.

ఈ శంబాల సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయ...