Hyderabad, మార్చి 25 -- OTT Horror Thriller: హారర్ థ్రిల్లర్ జానర్ మెచ్చే ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. నాలుగేళ్ల కిందట నేరుగా ఓటీటీలోకి వచ్చి వణికించిన చోరీ మూవీకి ఇప్పుడు సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమా కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలోనే స్ట్రీమింగ్ కానుంది. మంగళవారం (మార్చి 25) టీజర్ రిలీజ్ చేస్తూ.. స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2021లో చోరీ అనే మూవీ వచ్చింది. బాలీవుడ్ నటి నుష్రత్ బరూచా నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను వణికించింది. ఇందులోని ట్విస్టులు, నటీనటుల నటన ఆకట్టుకున్నాయి. ఓ మారుమూల గ్రామంలోని ఓ పొలంలోనే మొత్తం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ప్రైమ్ వీడియోలోకే వచ్చింది.

ఇప్పుడీ మూవీకి సీక్వెల్ రాబోతోంది. ఈ సినిమా పేరు చోరీ 2. ఈ హారర్ థ్రిల్లర్ ఏప్రిల్ 11 నుంచి ప్రైమ్ వ...