Hyderabad, మార్చి 27 -- OTT Horror Movie Aghathiyaa Release In Two Platforms: టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ రాశీ ఖన్నా ఇటీవల కాలంలో తెలుగు సినిమాలు ఏం చేయట్లేదు. ఎక్కువగా హిందీ, తమిళ భాషల్లోనే మూవీస్ చేస్తూ బిజీగా ఉంటోంది. ఓటీటీ వెబ్ సిరీస్‌లలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా హారర్ మూవీస్‌పై ఫోకస్ పెడుతోంది. వాటిని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.

ఇదివరకే తమన్నాతో అరణ్మనై 4 తెలుగులో బాక్ సినిమాలో నటించిన రాశీ ఖన్నా రీసెంట్‌గా మరో తమిళ హారర్ సినిమాలో హీరోయిన్‌గా చేసింది. ఆ మూవీనే అగత్యా. తమిళ హిస్టారికల్ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన అగత్యాలో తమిళ హీరో జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలు పోషించారు. వీరితోపాటు యోగిబాబు, వీటీ గణేష్ కామెడీ రోల్స్ చేశారు.

అగత్యా సినిమాకు రైటర్ పా విజయ్ కథ అందించి, దర్శకత్...