Hyderabad, ఏప్రిల్ 16 -- OTT Horror Movie: హారర్ జానర్ సినిమాలకు ఓటీటీలో ఎంత డిమాండ్ ఉంటుందో తాజాగా స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ తమిళ హారర్ అడ్వెంచర్ మూవీ నిరూపిస్తోంది. ఈ సినిమా గత ఆదివారం (ఏప్రిల్ 13) జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టింది. తొలి మూడు రోజుల్లోనే ఏకంగా 5 కోట్ల స్ట్రీమింగ్ మినట్స్ ను సొంతం చేసుకోవడం విశేషం.

మ్యూజిక్ డైరెక్టర్ అయిన జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన మూవీ కింగ్‌స్టన్. ఈ సినిమా గత నెల 7వ తేదీన థియేటర్లలో రిలీజైంది. తెలుగులోనూ రిలీజైన ఈ హారర్ అడ్వెంచర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ సాధించలేదు. అయితే ఇప్పుడు జీ5 ఓటీటీలో మాత్రం దూసుకెళ్తోంది.

తొలి మూడు రోజుల్లోనే ఏకంగా 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ రికార్డును అందుకుంది. కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జీ5లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం తెలుగు వెర్...