Hyderabad, మార్చి 27 -- OTT Horror Comedy: హారర్ కామెడీ జానర్ ఓటీటీలో సూపర్ హిట్ ఫార్ములా. ఇప్పుడీ జానర్లోనే కన్నడ మూవీ ఛూ మంతర్ వస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ చూసిన సినిమా ఇది. కన్నడ నటుడు శరణ్ నటించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

కన్నడ హారర్ కామెడీ మూవీ ఛూ మంతర్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రాబోతోంది. శుక్రవారం (మార్చి 28) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. గతంలో కర్వ అనే హారర్ డ్రామా తీసిన డైరెక్టర్ నవనీత్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. తరుణ్ శివప్ప నిర్మించిన ఈ సినిమా గతేడాదే థియేటర్లలోకి రావాల్సి ఉన్నా.. కాస్త ఆలస్యంగా ఈ ఏడాది జనవరిలో సంక్రాంతికి రిలీజైంది.

కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈ ఏడాది మూడు నెలల్లోనే 60 సినిమాలు రిలీజైనా.. అన్నీ బాక్సాఫీస్ దగ్...