Hyderabad, మార్చి 14 -- OTT Horror Comedy: ఓటీటీలో మంచి డిమాండ్ ఉన్న జానర్లలో హారర్ కామెడీ కూడా ఒకటి. ఈ జానర్లో ఏ ఇండస్ట్రీ నుంచి మూవీ వచ్చినా ఓటీటీ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలా ఇప్పుడు ఓ కన్నడ మూవీ వచ్చింది. జనవరి 24న థియేటర్లలో రిలీజై.. ఐఎండీబీలో ఏకంగా 9.1 రేటింగ్ సొంతం చేసుకున్న సినిమా ఇది.

హారర్ కామెడీ జానర్లో వచ్చిన ఈ సినిమా పేరు ఫారెస్ట్. ఈ ఏడాది జనవరి 24న వచ్చిన ఎన్నో కన్నడ సినిమాల్లో ఇదీ ఒకటి. చిక్కన్న, అనీష్ తేజేశ్వర్, గురునందన్, రంగాయన రఘు, సూరజ్ లాంటి వాళ్లు నటించిన సినిమా ఇది. ఈ మూవీ శుక్రవారం (మార్చి 14) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.

ఈ సినిమాకు మొదటి షో నుంచే మంచి రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం సక్సెస్ సాధించలేదు. చంద్ర మోహన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. 80 శాతం వరకు ఓ అడవిలోనే సాగ...