Hyderabad, ఏప్రిల్ 3 -- OTT Horror Adventure Movie: హారర్ అడ్వెంచర్ తమిళ మూవీ కింగ్‌స్టన్ (Kingston) ఓటీటీలోకి వచ్చేస్తోంది. అయితే ఓటీటీతోపాటు టీవీలోనూ ఈ సినిమా ఒకే సమయానికి రానుండటం విశేషం. ఈ మధ్యకాలంలో తాను హక్కులు పొందిన సినిమాలను చాలా వరకు ఇలాగే తీసుకొస్తోంది జీ నెట్‌వర్క్. ఇప్పుడీ మూవీ కూడా అటు జీ5 ఓటీటీ, ఇటు జీ తమిళం ఛానెల్ లో ఒకే సమయానికి రానుంది.

జీవీ ప్రకాశ్ కుమార్ నటించిన మూవీ హారర్ అడ్వెంచర్ మూవీ కింగ్‌స్టన్. ఈ సినిమా మార్చి 7న థియేటర్లలో రిలీజై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు నెల రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 13 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అదే రోజు జీ తమిళం ఛానెల్లోనూ టెలికాస్ట్ కానుంది. ఏప్రిల్ 13 మధ్యాహ్నం 12 గంటలకు ఈ స్ట్రీమింగ్, టెలికాస్ట్ ప్రారంభం అవుతుందని ఆ నెట్‌వర్క్ వెల్లడించింది.

"సముద్రం పిలుస్తోంది...