Hyderabad, మార్చి 27 -- Mon Mon Mon Monsters OTT Release: ఓటీటీలోకి ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. వీటిలో హారర్, బోల్డ్, కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, ఫ్యామిలీ వంటి జోనర్లలోనే ఎక్కువగా సినిమాలు ఉంటాయి. ఇక హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ సెపరేట్‌గా ఉంటాయి.

కథ ఎలా ఉన్న భయపెట్టే హారర్ సీక్వెన్స్‌తో ఇవి మినిమమ్ గ్యారెంటీ మూవీస్‌గా నిలుస్తుంటాయి. చాలా వరకు ఆడియెన్స్ హారర్ సినిమాలను చూసేందుకే ఇష్టపడుతుంటారు. అలాంటి సినిమాల్లో ఒకటే మాన్ మాన్ మాన్ మాన్‌స్టర్స్. 2017లో తెరకెక్కిన ఈ సినిమాను ముందుగా 41వ హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చివరి మూవీగా ప్రదర్శించారు.

ఏప్రిల్‌లో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన అనంతరం 2017 జూలై 28న థియేటర్లలో మాన్ మాన్ మాన్ మాన్‌స్టర్స్ సినిమాను విడుదల చేశారు. థియేటర్లలో రిల...