భారతదేశం, ఏప్రిల్ 23 -- తెలుగు హార‌ర్ మూవీ మ‌సూద ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న సినిమాగా రిలీజై పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఆడియెన్స్‌ను భ‌య‌పెట్టిన ఈ హార‌ర్ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన మూడేళ్ల త‌ర్వాత మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుద‌లైంది. మ‌సూద స్ట్రీమింగ్ వివ‌రాల‌ను అమెజాన్ ప్రైమ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఆహా ఓటీటీలో మ‌సూద‌ అందుబాటులో ఉంది

మ‌సూద మూవీలో తిరువీర్‌, సంగీత‌, బాంధ‌వి శేఖ‌ర్‌, కావ్య క‌ళ్యాణ్‌రామ్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సాయికిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రెగ్యుల‌ర్ హార‌ర్ మూవీస్‌కు భిన్నమైన నేప‌థ్యాన్ని ఎంచుకొని ద‌ర్శ‌కుడు మ‌సూద మూవీని తెర‌కెక్కించాడు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో పాటు హార‌ర్‌, ఎలిమెంట్స్‌, ట్విస్ట్‌లు ఆడియెన్స్‌కు థ్రిల్లింగ్‌ను పంచాయి.

నీలం భ‌ర్త‌కు దూరంగా త‌న కూతురు న...