Hyderabad, మార్చి 14 -- Churuli OTT Release Telugu: ఓటీటీలో వచ్చే మలయాళం సినిమాలకు ఎంత పెద్ద క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో కూడా రేఖాచిత్రం, ఐడెంటిటీ వంటి ఎన్నో సినిమాలు అటు థియేటర్లలో ఇటు ఓటీటీలో సత్తా చాటాయి. అందుకే ఎప్పుడు మాలీవుడ్ చిత్రాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది.

అందుకే మలయాళం సినిమాలను చూసేందుకు అన్ని ఇండస్ట్రీల ఆడియెన్స్ ఆసక్తి చూపిస్తుంటారు. వారికి అభిరుచికి తగినట్లుగానే ఆ సినిమాలు కూడా ఉంటున్నాయి. ఇక ఓటీటీలో ఎక్కువగా అలరించే జోనర్స్‌లలో హారర్ థ్రిల్లర్స్ ఒకటి. ఇలాంటి జోనర్‌లో ట్విస్టులతో మతి పోగొట్టే ఓ మలయాళ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అదే చురులి.

చెంబన్ వినోద్, వినయ్ ఫోర్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన చురులిలో మలయాళ పాపులర్ యాక్టర్స్ జోజు జార్జ్, సౌబిన్ షాహిర్ క్లైమాక్స్ చివర్లో కీలక పాత్...