భారతదేశం, మార్చి 31 -- తమిళ హారర్ ఫ్యాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం 'కింగ్‍స్టన్' చాలా అంచనాలతో వచ్చింది. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో హారర్ మూవీగా వస్తుండటంతో హైప్ నెలకొంది. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ చిత్రం మార్చి 7న థియేటర్లలో రిలీజైంది. అయితే, మిక్స్డ్ టాక్ తెచ్చుకొని అంచనాలను నిలబెట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.

కింగ్‍స్టన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ తరఉమంలో ఈ సినిమా స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందో తాజాగా సమాచారం బయటికి వచ్చింది. సోషల్ మీడియాలో ఈ డేట్ చక్కర్లు కొడుతోంది.

కింగ్‍స్టన్ సినిమా ఏప్రిల్ 4వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వస్తుందని స...