Hyderabad, మార్చి 17 -- Companion OTT Release: ఓటీటీలోకి ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సినిమాలు ఎంట్రీ ఇస్తూ అలరిస్తుంటాయి. అయితే, మనుషులకు సాధారణంగా ఉండే భయాన్ని బేస్ చేసుకుని తీసే సినిమాలకు మంచి ఆదరణ వస్తోంది. అలా భయపెట్టి తెరకెక్కించే సినిమాలే హారర్ థ్రిల్లర్స్.

ఈ హారర్ థ్రిల్లర్స్‌కు అదనంగా ఇంకో జోనర్ యాడ్ చేసి రూపొందిస్తే మరింత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు ఓటీటీ ఆడియెన్స్. ఇలా ఓటీటీలోకి వచ్చిన సరికొత్త హారర్ థ్రిల్లర్ మూవీనే కంపానియన్. హారర్‌కు సైన్స్ ఫిక్షన్ యాడ్ చేసి సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రంగా వచ్చిందే కంపానియన్.

కంపానియన్ అంటే ఇంగ్లీష్‌లో సహచరుడు, జతగాడు అనే అర్థాలు వస్తాయి. 2025 జనవరి 31న థియేటర్లలో విడుదలైన కంపానియన్ మూవీకి డ్య్రూ హన్‌కాక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు హ్రిషికేశ్ హిర్వే ...