Hyderabad, మార్చి 24 -- Aghathiyaa OTT Release: ఓటీటీ హారర్ సినిమాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎప్పటికప్పుడు వచ్చి సరికొత్త హారర్ థ్రిల్లర్ మూవీస్‌ను ఓటీటీ లవర్స్ ఆలస్యం చేయకుండా చూసేస్తారు. ఇప్పుడు అలాంటి వారికోసం న్యూ తమిళ, తెలుగు హారర్ ఫాంటసీ థ్రిల్లర్ మూవీ అగత్యా ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

కోలీవుడ్‌ హీరో జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, బ్యూటిఫుల్ హీరోయిన్ రాశీ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన సినిమా అగత్యా. వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఐసరి గణేష్‌ నిర్మించిన ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా. విజయ్‌ కథ, దర్శకత్వం వహించారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ తెరకెక్కింది.

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన అగత్యా ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదలైంది. తమిళంతోపాటు తెల...