Hyderabad, ఏప్రిల్ 19 -- Khauf OTT Release In Telugu And Trending: ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఈ వారం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి. వాటిలో హారర్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఖౌఫ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఏప్రిలే 18 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఖౌఫ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

రిలీజ్ అయిన ఒక్కరోజులోనే ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 స్థానం సంపాదించుకుని సత్తా చాటుతోంది ఖౌఫ్. అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 18 నుంచి ఖౌఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, మొదట కేవలం హిందీ భాషలోనే ఖౌఫ్ ఓటీటీ రిలీజ్ అవుతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. కానీ, ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసరికి ఏకంగా ఐదు భాషల్లో ఖౌఫ్ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.

హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, తమిళ వంటి ఐదు భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో ఖౌఫ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది....