Hyderabad, ఏప్రిల్ 13 -- Kingston Movie OTT Release Lately: తమిళంలో సంగీత దర్శకుడుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు జీవి ప్రకాష్ కుమార్. అటు మ్యూజిక్ డైరెక్టర్‌గా, ఇటు హీరోగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే హీరోగా, సంగీత దర్శకుడుగా జీవీ ప్రకాష్ కుమార్ చేసిన సినిమా కింగ్‌స్టన్.

ఇండియాలోనే మొట్ట మొదటి సీ అడ్వెంచర్ హారర్ ఫాంటసీ మూవీగా కింగ్‌స్టన్ తెరకెక్కింది. ఈ సినిమాలో జీవీ ప్రకాష్ కుమార్‌కు జోడీగా హీరోయిన్ దివ్య భారతి నటించింది. జీవీ ప్రకాష్ కుమార్, దివ్య భారతి కలిసి నటించిన రెండో సినిమా ఇది. కింగ్‌స్టన్ మూవీకి కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించారు.

ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన కింగ్‌స్టన్ నిర్మాతల్లో హీరో జీవి ప్రకాష్ కుమార్ కూడా ఉండటం విశేషం. ఇక కింగ్‌స్టన్ మూవీ మార్చి 7న థియేటర్లల...