Hyderabad, ఫిబ్రవరి 21 -- OTT Historical Drama: ఓటీటీలోకి మరో హిస్టారికల్ డ్రామా మూవీ వచ్చేస్తోంది. దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఎమర్జెన్సీ మూవీ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టి డిజాస్టర్ గా మిగిలిపోయిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను కంగనా రనౌత్ వెల్లడించింది.

కంగనా రనౌత్ డైరెక్ట్ చేసి, తానే ఇందిరా గాంధీ పాత్రలో నటించిన మూవీ ఎమర్జెన్సీ. ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత జనవరి 17న రిలీజైంది. అయితే బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇప్పుడీ మూవీ రెండు నెలల తర్వాత అంటే మార్చి 17 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ అధికారికంగా వెల్లడించలేదు.

అయితే కంగనానే తన ఇన్‌స్టా స్టోరీలో ఈ పోస్ట్ చేసింది. ఇందిరా గాంధీ పాత ఫొటోత...