భారతదేశం, జనవరి 20 -- మరో లాగ్ వీకెండ్ రాబోతోంది. ఈసారి శని, ఆదివారాలతోపాటు రిపబ్లిక్ డే రూపంలో సోమవారం (జనవరి 26) కూడా హాలీడే ఉండనుంది. ఈ నేపథ్యంలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ కూడా వినోదం పంచడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ శుక్రవారం (జనవరి 23, 2026) వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌ రాబోతున్నాయి. ధనుష్, కిచ్చా సుదీప్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు శోభిత ధూళిపాళ నటించిన తెలుగు థ్రిల్లర్ కూడా లిస్టులో ఉంది.

శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో.. సంధ్య (శోభిత) ఒక క్రిమినాలజీ గ్రాడ్యుయేట్, ట్రూ-క్రైమ్ పాడ్‌కాస్టర్. తన ఇంటర్న్ అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో ఆమె ఇన్వెస్టిగేషన్ మొదలుపెడుతుంది. రెండు దశాబ్దాలుగా యాక్టివ్‌గా ఉన్న ఒక...