Hyderabad, ఏప్రిల్ 21 -- OTT Family Drama: సుమంత్ నటించిన ఫ్యామిలీ డ్రామా అనగనగా. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలకుపైనే అయినా.. ఇప్పటి వరకూ పెద్ద హిట్ కొట్టని సుమంత్.. ఈసారి నేరుగా ఓటీటీలోకి అడుగుపెడుతున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాలో పిల్లలకు కథలు చెప్పే మాస్టారు పాత్రలో అతడు నటిస్తున్నాడు.

సుమంత్ అక్కినేని నటించిన మూవీ అనగనగా. ఈ సినిమాను మే 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈటీవీ విన్ ఓటీటీ సోమవారం (ఏప్రిల్ 21) వెల్లడించింది. "పరీక్షల ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? చిల్ అవండి. స్మైల్ ఇవ్వండి. స్మార్ట్ గా రివైజ్ చేయండి. బాగా నిద్రపోండి. మీపై మీరు నమ్మకం ఉంచండి. అనగనగా ఓ విన్ ఒరిజినల్ మూవీ.. మే 9 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది" అనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ఓటీటీ ట్వీట్ చేసింది.

ఈ సందర్భంగా పరీక్షల...