Hyderabad, ఫిబ్రవరి 11 -- OTT Family Drama: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్స్, థ్రిల్లర్స్, హారర్ జానర్ సినిమాలే కాదు.. ఫ్యామిలీ డ్రామాలకు కూడా మంచి ఆదరణ లభిస్తుందని నిరూపిస్తోంది ఈ మధ్యే వచ్చిన ఓ హిందీ మూవీ. మలయాళంలో నాలుగేళ్ల కిందట వచ్చిన ది గ్రేట్ ఇండియన్ కిచెన్ మూవీకి రీమేక్ గా వచ్చిన మిసెస్ (Mrs.) అదరగొడుతోంది. జీ5 ఓటీటీలో పలు రికార్డులను బ్రేక్ చేస్తోంది.

దంగల్ మూవీ ఫేమ్ సాన్యా మల్హోత్రా నటించిన మూవీ మిసెస్ (Mrs.). ఈ సినిమా జీ5 ఓటీటీలో దుమ్ము రేపుతోంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే వెల్లడించింది. "మిసెస్ ఓ బ్లాక్‌బస్టర్ డెబ్యూ చేసింది. మిస్ కావద్దు" అని క్యాప్షన్ తో ఓ పోస్ట్ చేసింది. "రికార్డులు బ్రేకవుతున్నాయి. జీ5లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఎవర్" అనే క్యాప్షన్ తో మరో పోస్ట్ కూడా జీ5 ఓటీటీ చేయడం విశేషం.

అంతేకాదు ఇది గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసి...