భారతదేశం, మార్చి 12 -- తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన 'బాపు' చిత్రం మంచి అంచనాలతో వచ్చింది. బలగం చిత్రంతోనూ ఈ మూవీకి పోలికలు వచ్చాయి. బాపు మూవీ గత నెల ఫిబ్రవరి 21వ తేదీన థియేటర్లలో రిలీజైంది. బ్రహ్మాజీ, ఆమని, సుధాకర్ రెడ్డి ఈ రూరల్ ఫ్యామిలీ కామెడీ డ్రామా మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. అయితే, ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అనుకున్న రిజల్ట్ రాలేదు. బాపు మూవీ ఇటీవలే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు కూడా వచ్చింది.

బాపు చిత్రం గత శుక్రవారం (మార్చి 7) జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ బాపు చిత్రానికి మంచి వ్యూస్ దక్కుతున్నాయి. దీంతో ఈ చిత్రం హాట్‍స్టార్ ఓటీటీ ట్రెండింగ్‍లో టాప్ ప్లేస్‍కు వచ్చేసింది.

బాపు చిత్రం ప్రస్తుతం (మార్చి 12) జియ...