Hyderabad, ఫిబ్రవరి 23 -- Tasher Ghawr OTT Release: ఓటీటీలోకి ఎన్నో రకాల కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరిస్తుంటాయి. వాటిలో వివిధ జోనర్స్ ఉంటాయి. అయితే, హారర్, కామెడీ, క్రైమ్ జోనర్స్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు ఆడియెన్స్. ఇవే కాకుండా ఫ్యామిలీ డ్రామా సినిమాలకు కూడా మంచి ఆదరణ ఉంటుంది.

అలాంటి ఫ్యామిలీ డ్రామా సినిమాకు కాస్తా క్రైమ్ ఎలిమెంట్స్ యాడ్ అయితే మరింత ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇలాంటి ఫ్యామిలీ క్రైమ్ డ్రామా సినిమానే తాషేర్ ఘౌర్. అయితే, లాక్‌డౌన్ సమయంలో ఒక కుటుంబంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తాషేర్ ఘౌర్ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. అలాగే, 2020 సంవత్సరంలో కరోనా లాక్‌డౌన్ సమంయలోనే తాషేర్ ఘౌర్ సినిమాను నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు.

తాషేర్ ఘౌర్ ఒక బెంగాలీ చిత్రం. అయితే, ఈ సినిమాలో ఒకే ఒక్క పాత్ర సుజాత మాత్...