Hyderabad, మార్చి 23 -- Disaster Movies Trending On OTT: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూ ఉంటాయి. అయితే, వాటి ఫలితాలు బాక్సాఫీస్ వద్ద ఒకలా, ఓటీటీలో మరోలా ఉంటాయి. కొన్నిసార్లు థియేటర్లలో అదిరిపోయే కలెక్షన్స్ తెచ్చుకున్న సినిమాలు ఓటీటీలో యావరేజ్‌గా నిలుస్తాయి.

అలాగే, థియేటర్లలో మంచి రెస్పాన్స్ లేక బొక్కబోర్లా పడ్డ మూవీస్ ఓటీటీలో మాత్రం దుమ్ముదులుపుతాయి. ఇప్పుడు రెండు సినిమాలపై ఓటీటీ ఆడియెన్స్ ఆదరణ అలాగే ఉంది. ఈ ఏడాది ఒకే రోజు థియేటర్లలో విడుదలైన రెండు బిగ్గెస్ట్ బడ్జెట్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు అవి ఓటీటీ ట్రెండింగ్‌లో వరుసగా దూసుకుపోతున్నాయి.

బాలీవుడ్ కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తొలిసారి దర్శకత్వం వహించిన హిస్టారికల్ పొలిటికల్ డ్రామా మూవీ ఎమర్జెన్సీ. కంగనా రనౌత్ కథ అందిం...